పేద ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని గుంటూరు జిల్లా సీపీఎం కార్యదర్శి పాశం రామారావు అన్నారు. అధికారంలోకి వస్తే అందరికీ ఇసుకను చేరువ చేస్తామని చెప్పి.... ఇప్పుడు ఇసుకను అందకుండా చేస్తున్నారన్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలే ఇసుక విధానాన్ని విమర్శిస్తున్నారని రామారావు అన్నారు. ఆన్లైన్లో ఇసుక నమోదు అని... అక్కడేమో ఇసుక లేదని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇసుకను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని.. లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: అడవి పందుల కోసం పెడితే ఏనుగు చనిపోయిందట!