ETV Bharat / state

వామపక్షాల భోగి మంటలు.. వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ - భోగీ మంటల వద్ద సీపీఐ నిరసన

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా భోగి మంటలు వేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వైఖరిని ఖండించారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

భోగీ మంటల వద్ద సీపీఐ నిరసనలు
cpi statewide protests
author img

By

Published : Jan 13, 2021, 10:40 AM IST

రైతు చట్టాలపై సీపీఐ నిరసన

వ్యవసాయ సాగు చట్టాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించిన కమిటీ వల్ల ప్రయోజనం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సీపీఐ నిర్వహించిన భోగి మంటల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం రూపొందించిన సాగు చట్టాల ప్రతులు, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్ను ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే...మరోవైపు ప్రజలపై మోయలేని భారాలను మోపుతోందని రామకృష్ణ ఆరోపించారు.

సీపీఐ రామకృష్ణ

కడపలో..

కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన జీవోలను రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామని కడప జిల్లా సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య హెచ్చరించారు. ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ కడప నగరపాలక కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. సంబంధిత పత్రాలను భోగి మంటల్లో వేసి దహనం చేస్తూ... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు ఉరితాడుగా మారిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

శ్రీకాకుళంలో..

శ్రీకాకుళంలో వామపక్షాల ఆధ్వర్యంలో భోగి మంటల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల బిల్లులను దగ్ధం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నులను పెంచుతూ ఇచ్చిన జీవో ప్రతులను మంటల్లో వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మొండి వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ఎస్‌ఈసీ అప్పీల్‌పై 18న విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.