లాక్డౌన్ వేళ రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవటంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయం కోసం కక్కుర్తిపడి ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం దారుణమని విమర్శించారు. పుస్తకాల దుకాణాలు తెరిచేందుకు అనుమతించని పోలీసులు.. మద్యం షాపులు ఎలా తెరవనిచ్చారని ప్రశ్నించారు.
8 గంటలా..!
నిత్యావసరాల కొనుగోలుకు 3 గంటలిచ్చి.. మద్యం కోసం 8 గంటలు సమయం ఇవ్వటం ఏ మేరకు సబబన్నారు. లాక్డౌన్ కారణంగా రంజాన్ మాసంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేసుకోవడం లేదని.. అలాంటిది మద్యం దుకాణాల వద్దకు మాత్రం వేలాది మందిని ఎలా అనుమతిస్తారని ధ్వజమెత్తారు. ధరలు పెంచింది పేదల్ని దోచుకోవటానికేనని.. మద్యానికి దూరం చేయటానికి కాదని అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి..