జైల్ భరో కార్యక్రమంలో అరెస్టైన రైతులను, ఐకాస నాయకులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తెదేపా నేత తెనాలి శ్రావణ్ కుమార్ పరామర్శించారు. గుంటూరు పట్టాభిపురం, నల్లపాడు పొలీస్ స్టేషన్ లో ఉన్న రైతులను కలిశారు. అమరావతి ఉద్యమాన్ని అరెస్టులుతో ఆపలేరని.. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని రామకృష్ణ విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం అమరావతి విషయంలో వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే: సీఎం జగన్