ఎన్నిసార్లు న్యాయస్థానాలతో చివాట్లు పెట్టించుకుంటారని ముఖ్యమంత్రి జగన్ను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. కోర్టులతో ఇన్నిసార్లు చివాట్లు తిన్న ముఖ్యమంత్రి దేశంలో ఇంకెవరూ లేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను ధిక్కరిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన న్యాయస్థానాలను, ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
సాక్షాత్తూ రాష్ట్ర శాసనసభాపతి కూడా న్యాయస్థానాన్ని ధిక్కరిస్తున్నారు. రాష్ట్ర మంత్రి ఒకరు ప్రభుత్వానికి తీర్పు అనుకూలంగా రాకపోతే రాజధానిని అమరావతిలో ఉండనీయబోమని బెదిరిస్తున్నారు. అంటే న్యాయ పరిధుల్లో కాకుండా సమస్యను ఫ్యాక్షనిస్టుల తరహాలో బయట పరిష్కరించుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి రాజధాని ప్రాంత రైతులకు ఇవ్వాల్సిన కౌలు డబ్బులు పూర్తిగా చెల్లిస్తామని రెండు నెలల క్రితం నాతో చెప్పారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. కౌలు డబ్బులు చెల్లించాలని కోరిన అమరావతి రైతులపై కేసులు పెట్టి... అరెస్టు చేయడం దారుణం. ఇదేనా ప్రజలు కోరుకున్న పరిపాలన. జగన్మోహన్ రెడ్డి మొండివైఖరి ప్రజాస్వామ్యానికి, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అవమానం.
- నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
--
ఇదీ చదవండి:
'కౌలు అడిగేందుకు వెళ్తే కొట్టిస్తారా.. ఇదేనా రైతు ప్రభుత్వం?'