గుంటూరు జిల్లా తెనాలిలో అత్యవసర విభాగంలో కరోనా అనుమానితులకు వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చి రోజులు గడుస్తున్నా.. కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజన సౌకర్యాలు కూడా లేవని వాపోతున్నారు. సాధారణ చికిత్స కోసం వచ్చేవారు సైతం వీరిని చూసి భయపడే పరిస్థితి నెలకొంది.
ఇదిలావుంటే అత్యవసర విభాగంలో ఉంచి కరోనా అనుమానితులకు చిక్సిత్స అందిస్తున్న విషయం తనకు తెలియదని ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారు.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: కొల్లిపర రిజిస్ట్రార్ కార్యాలయం మూసివేత