ETV Bharat / state

నాగులపాడులో ఇద్దరు యువకులకు కరోనా పాజిటివ్ - corona updates in guntur dst

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులో ఇద్దరు యువకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అధికారులు నాగులపాడును కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు.

covid positive in guntur dst pedanandipadu mandal nagulapdu

author img

By

Published : Jul 4, 2020, 3:57 PM IST

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులో నివాసం ఉంటున్న ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. వారిద్దరూ ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. వారు ఎక్కడ తిరిగారు, ఎవరిని కలిశారు అనే వివరాలను అధికారులు సేకరించారు.

ఆ బాధితులు నివాసం ఉంటున్న రూమ్​లో ఒక మహిళ పనులు చేసేది. ఆమె కాకుమాను మండలం కొమ్మూరుకు చెందిన మహిళగా గుర్తించారు. ఆమెను ఇంట్లోనే ఉండాలని బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. నాగులపాడును కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు.

ఇదీ చూడండి

కరోనాతో ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.