గుంటూరులో కొవిడ్ సోకిన వృద్ధ దంపతులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. నగరంలోని అమరావతి రోడ్డులోని రామ బిల్డింగ్‌లో నివాసముంటున్న దంపతులు వడ్లమూడి సంజీవరావు, సాయిజ్యోతి. ఇద్దరూ గత నెలలో కొవిడ్ బారినపడ్డారు. దీంతో వారిద్దరిని వారి కుమార్తె, అల్లుడు.. అడవితక్కెళ్లపాడులోని క్వారంటైన్ కేంద్రంలో చేర్పించారు. అనంతరం అల్లుడు, కుమార్తె వైరస్ బారిన పడటంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.
ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత కుమార్తె, అల్లుడు.. సంజీవరావు, సాయిజ్యోతి గురించి అడవితక్కెళ్లపాడులోని క్వారంటైన్ కేంద్రంలో ఆరా తీశారు. వారికి ఆరోగ్యం విషమించడంతో జీజీహెచ్‌కు తరలించినట్లు చెప్పారు. జీజీహెచ్‌లో అడిగితే అక్కడి సిబ్బంది తమకు సమాచారం లేదంటున్నారని సంజీవరావు అల్లుడు అనిల్ తెలిపారు. వృద్ధ దంపతులు ఏమయ్యారో తెలియక కుమార్తె, అల్లుడు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి..