ETV Bharat / state

గుంటూరులో పత్తి కొనుగోళ్లు ప్రారంభం - cotton updates in guntur

గుంటూరులో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. మెుత్తం 11 మార్కెట్ యార్డులు, 19 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు చేయనున్నారు. వీటి ధరలపై ఇప్పటికే సీసీఐ నిర్ణయం తీసుకుంది. దాదాపు 45లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా వేస్తున్నారు.

Cotton purchases
పత్తి కొనుగోళ్లు ప్రారంభం
author img

By

Published : Oct 29, 2020, 1:39 PM IST

గుంటూరు జిల్లాలో గురువారం నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 11 మార్కెట్ యార్డులు, 19 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేయనున్నారు. వీటి ధరలను ఇప్పటికే సీసీఐ నిర్ణయించింది. పొట్టి పింజ రకాలకు రూ. 5,515, పొడవు పింజ రకాలు రూ. 5,825 ఖరారు చేసింది.

ప్రస్తుతం బయటి మార్కెట్లో ఒక క్వింటా ధర 4వేల లోపే ఉండటంతో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలకే తీసుకు వచ్చే అవకాశం ఉంది. పత్తి అమ్మదలచుకున్నవారు ముందుగా రైతు భరోసా కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. అక్కడ కేటాయించిన స్లాట్ నంబర్ ప్రకారం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలని అధికారులు తెలిపారు.

సీసీఐ నిబంధనల ప్రకారం 12శాతం లోపు తేమ ఉన్న పత్తిని మాత్రమే తీసుకు రావాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఎండబెట్టుకుని తీసుకురావాలని అధికారులు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 3లక్షల 87వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. ఈ ప్రకారం 45లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా వేశారు.

ఇదీ చదవండీ...

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే: ఎన్జీటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.