ETV Bharat / state

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. వార్డులోనే కరోనా బాధితురాలి మృతదేహం - tenali corona news

tenali government hospital
తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి
author img

By

Published : Aug 1, 2020, 8:00 AM IST

Updated : Aug 1, 2020, 8:46 AM IST

07:55 August 01

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. వార్డులోనే కరోనా బాధితురాలి మృతదేహం

గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఉదాసీనత రోగుల్లో ఆందోళన పెంచింది. కరోనాతో కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన మహిళా బాధితురాలు శుక్రవారం మృతి చెందింది. అయితే మృతదేహాన్ని మార్చురీకి తరలించకుండా సిబ్బంది అలాగే ఉంచారు. దీంతో ఆ వార్డులో ఉన్న మిగతా రోగులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.  

     తెనాలి ఆసుపత్రిలో నాలుగో తరగతి సిబ్బంది లేరు. దీంతో మృతదేహాలు మార్చురీకి తరలించే పరిస్థితి లేకుండా పోయింది. ఆసుపత్రి పారిశుధ్ధ్య సిబ్బందికి మృతదేహాన్ని తరలించాలని చెప్పినా వాళ్లు అది తమ పని కాదని వెళ్లిపోయారంటూ యాజమాన్యం తెలిపింది.  ఆసుపత్రి అధికారులు శనివారం ఉదయం మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది వచ్చి మృతదేహం తీసుకెళ్లే వరకైనా తమను వేరే వార్డులోకి తరలించలేదని అక్కడి బాధితులు వాపోయారు. 

ఇవీ చదవండి..

 'మూడు రాజధానులపై నిర్ణయానికి ఇది సమయం కాదు'

Last Updated : Aug 1, 2020, 8:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.