ETV Bharat / state

కరోనా భయంతో కంటి ఆస్పత్రుల్లో కానరాని రోగులు

కరోనా వల్ల మొదటగా రోగులే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రులకు వారు వెళ్లాలంటే భయపడుతున్నారు. నేత్ర వ్యాధులున్న వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. కోవిడ్ వల్ల ఆసుపత్రులకు వెళ్లలేక..వైద్యం లేక కళ్లు కనపడక నరకయాతన పడుతున్నారు.

corona effect on eye patients
కరోనా భయంతో కంటి ఆస్పత్రుల్లో కానరాని రోగులు
author img

By

Published : Sep 11, 2020, 9:31 AM IST

ఆసుపత్రులకు వెళ్లలేక..

అన్ని రంగాలను కుదిపేసిన కరోనా... నేత్ర సంబంధిత ఆస్పత్రులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కొవిడ్ భయంతో కంటి ఆస్పత్రులకు సైతం రోగులు రావడం లేదు. నేత్ర సమస్యల్లో జాప్యం చేస్తే మరింత ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కళ్లు కనపడక ..

ప్రపంచాన్ని అతలాకులతం చేసిన కరోనాతో వైద్యరంగం సైతం కుదేలైంది. లాక్ డౌన్ ప్రభావంతో అత్యవసర వైద్యసేవలు మినహా అన్నిరకాల వైద్యసేవల ఓపీని నిలిపేశారు. నేత్ర సంబంధిత సమస్యలదీ అదే పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటి వైద్య సేవలు ఇప్పటికీ అందకపోగా... ప్రైవేటు ఆస్పత్రుల్లో పరిమితంగా చికిత్సలు జరుగుతున్నాయి. గుంటూరు పెదకాకానిలోని శంకర్ కంటి ఆస్పత్రితోపాటు పలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇప్పటికీ ఓపీ సేవలు 50 శాతానికి చేరుకోలేదు. కరోనా భయంతోనే ప్రజలు కంటి ఆస్పత్రులకు రావడం లేదని వైద్యులు చెబుతున్నారు.

కరోనా భయంతో కంటి ఆస్పత్రుల్లో కానరాని రోగులు

జాప్యం చేయొద్దు..!

కొవిడ్‌కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని... కళ్ల సమస్యలుంటే వాయిదా వేయకుండా ఆస్పత్రులకు రావాలని వైద్యులు చెబుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో శుక్లాలు ముదిరి... దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఆస్పత్రికి రాకుండా జాప్యం చేస్తే కొన్నిసార్లు కంటిచూపు రికవరీ శాతం తగ్గే అవకాశముందంటున్నారు.

కరోనా విషయంలో తగిన రక్షణ చర్యలు పాటిస్తూనే... కీలకమైన నేత్ర సంబంధిత సమస్యలపైనా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి. శ్రీశైలంలో 7 గంటలకుపైగా క్రస్ట్‌ గేట్లపై నుంచి నీరు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.