ETV Bharat / state

గుంటూరు జిల్లాలో విస్తరిస్తున్న కరోనా...68 కొత్త కేసులు నమోదు - జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్​ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 68 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 1,835కు చేరుకుంది.

జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు...68 కొత్త కేసులు నమోదు !

author img

By

Published : Jul 3, 2020, 10:52 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గటం లేదు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 1,835కు చేరుకుంది. కొత్త కేసుల్లో గుంటూరు కార్పోరేషన్ పరిధిలో 26, క్వారంటైన్ కేంద్రలో 1 కేసు నమోదయ్యాయి. రెంటచింతల7, తాడేపల్లి3, బాపట్ల 3, తెనాలి 5, సత్తెనపల్లిలో 3 కేసులు వచ్చాయి. మాచర్ల, గురజాల, ఎడ్లపాడుల్లో 2 చొప్పున.... అమరావతి, తాడికొండ, వినుకొండ, పొన్నూరు, కొల్లిపొర, బొల్లాపల్లి, దుర్గి, రొంపిచర్ల, దుగ్గిరాల, చేబ్రోలు, మంగళగిరిలో 1 కేసు చొప్పున నమోదయ్యాయి.

కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకూ 905 మంది డిశ్చార్జ్ అయ్యారు. కేసుల నమోదు, కోలుకున్న వారి సంఖ్య చూస్తే 50.11 శాతంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 23 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వైరస్ బాధితులను గుర్తించే క్రమంలో జిల్లాలో 92, 214 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో 86 వేల మందికి సంబంధించిన నివేదికలు నెగిటివ్​గా తేలాయి. మరో 4వేలకు పైగా నివేదికలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం గుంటూరు నగరంలో 697, నర్సరావుపేట 258, తాడేపల్లి 253, తెనాలి 81, మంగళగిరి 69 కేసులున్నాయి. మిగతా మండలాల్లో 477 కేసులు ఉన్నట్లు అధికారులు వివరించారు. జూన్ 1వ తేది నుంచి జిల్లాలో 1,296 కేసులు నమోదయ్యాయని స్పష్టం చేశారు. అంటే 70శాతం పైగా కేసులు నెల రోజుల్లో వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాతే కేసులు విపరీతంగా వస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.