గుంటూరు జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత ఐదు రోజుల నుంచి కేసులు ఏక సంఖ్యకే పరిమితమయ్యాయి. మంగళవారం ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఊరట కలిగించింది. 5 రోజుల నుంచి పరిశీలిస్తే 14 కేసులే నమోదయ్యాయి. ఈ నెల 8న ఒక కేసు రాగా, 9న 2, 10న 6, 11న 5 కేసులు రికార్డ్ అయ్యాయి. 12న ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటి వరకు జిల్లాలో 387 మందికి కరోనా సోకగా.. 198 మంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. మరో 181 మంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇంకా ఫలితాలు రావాల్సినవి ఉన్నాయని, కేసులు అప్పుడే తగ్గుముఖం పట్టినట్టు చెప్పలేమని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మంగళవారం గుంటూరు కొరిటిపాడు, పాతగుంటూరులోని పలువురు అనుమానితులను పరీక్షలకు తరలించారు. చెన్నై కోయంబీడ్ మార్కెట్ లింకులతో సంబంధాలు ఉన్న వారిని గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. నరసరావుపేట, గుంటూరులో కలిపి ఇంకా 400 ఫలితాలు రావాల్సి ఉందని తెలుస్తోంది.
నరసరావుపేటలో బుధవారంతో సంపూర్ణ లాక్‌డౌన్ ముగియనుంది. దీన్ని తిరిగి పొడిగిస్తారా లేదా అన్నది బుధవారం స్పష్టత వస్తుందని అధికారవర్గాలు తెలిపాయి.
పరీక్షల తీరుపై సభ్యుల ఆరా..
డాక్టర్ నందిని భట్టాచార్య, డాక్టర్ బాబీపాల్‌తో కూడిన వైద్య బృందం మంగళవారం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలోని వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించింది. క్వారంటైన్ కేంద్రాల్లో తీసి పంపుతున్న నమూనాలను ఇక్కడ పరీక్షించి వ్యాధి నిర్ధరిస్తున్నారు.
వ్యాధి నిర్ధరణకు అనుసరిస్తున్న విధానాలు, ప్రయోగశాలలో ఉన్న వసతులు, సౌకర్యాలను పరిశీలించి నిత్యం ఎన్ని నమూనాలు వస్తున్నాయి.. వాటిల్లో ఎన్ని పరీక్షిస్తున్నారని ప్రయోగశాలలో ఉండే వైద్యులు, ఇతర సాంకేతిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు గుంటూరు జీజీహెచ్‌లోని కొవిడ్ విభాగాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి: