ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కరోనా ఉద్దృతి.. ఒక్కరోజే 149 కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గటం లేదు. పల్లె పట్నం తేడా లేకుండా విస్తరిస్తూనే ఉంది. ఆదివారం ఒక్కరోజే 149 కేసులు వచ్చాయి. లాక్​డౌన్ ఆంక్షలు ఎత్తేశాక కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

corona cases in guntur district
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు
author img

By

Published : Jul 6, 2020, 8:24 AM IST

కొవిడ్ కేసుల విషయంలో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లాలో 2,199 పాజిటివ్ కేసులున్నాయి. ఆదివారం ఒక్కరోజు 149 కేసులు వెలుగుచూశాయి. ఇందులో నగర కార్పొరేషన్ పరిధిలో 67, క్వారంటైన్ కేంద్రంలో 20 కేసులు నమోదయ్యాయి.

నల్ల చెరువు 8, ఐపీడీ కాలని 4, సంజీవయ్య నగర్ 4, పీయస్. నగర్ 3 ,లాలాపేట 3, పోస్టల్ కాలనీ 3, ఏటీ. అగ్రహారం 2, పాత గుంటూరు 2, కొత్తపేట 2, చంద్రమౌళి నగర్ 2 కేసులు నమోదు కాగా.. గోరంట్ల, వేళంగిణి నగర్, శారద కాలని, శ్యామలానగర్, మిర్చి యార్డ్ , చౌత్ర, అమరావతి రోడ్, అరండల్ పేట, శ్రీనగర్ , స్వర్ణ భారతి నగర్, కృష్ణ నగర్, బాలాజీ నగర్, శివనగారాజు కాలనీ, అనందపేట, రామిరెడ్డి తోట, కొరిటిపాడు, నగరపాలెం, సంగడిగుంట, శ్రీనివాసరావు తోట, ఏటుకూరు, శివరాం నగర్​లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

గ్రామీణ ప్రాంతాల్లోనూ అధికమే

గుంటూరు గ్రామీణ ప్రాంతాల్లో తాడేపల్లి 13, తెనాలి 6, పిడుగురాళ్ల 5, మంగళగిరి మండలం 4, నరసరావుపేట మండలం 4, మాచెర్ల 4, సత్తెనపల్లి మండలం 4, చిలకలూరిపేట మండలం 3, తుళ్లూరు 3, నకరికల్లు 2, బాపట్ల మండలం 2, కొల్లిపర మండలం 2, ఫిరంగిపురం మండలం 2 కేసులు చొప్పున వచ్చాయి. పెదకాకాని, పొన్నూరు, తాడికొండ మండలం, రెంటచింతల, కారంపూడి మండలం, రాజుపాలెం, దాచేపల్లి మండలం, చేబ్రోలు మండలాల్లో ఒక్కో కేసు చొప్పున వెలుగుచూశాయి.

స్త్రీ, శిశుసంక్షేమ కార్యాలయ ఉద్యోగులకు పాజిటివ్

గుంటూరులోని స్త్రీ, శిశు సంక్షేమశాఖ రాష్ట్ర కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. ఇక్కడ వారం రోజుల క్రితం ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన అధికారాలు కార్యాలయంలో ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా.. 33 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మరో 30 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఒక్కసారిగా 33 కేసులు నమోదు కావటంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. కొన్నిరోజులు కార్యాలయం మూసివేసే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.

కరోనా కేసులు బాగా పెరుగుతున్న క్రమంలో అధికారులు నియంత్రణ చర్యలు ముమ్మరం చేశారు. కొత్తగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇవీ చదవండి..

అనుమానాస్పద స్థితిలో ట్రాన్స్​జెండర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.