ETV Bharat / state

గుంటూరు జిల్లాలో వేగంగా వైరస్ వ్యాప్తి.. ఒక్కరోజే 117 కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. బుధవారం ఒక్కరోజే 117 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1673కు పెరిగింది. తాజా కేసుల్లో ఒక్క గుంటూరు నుంచే 49 కేసులు నమోదుకావడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది..

corona cases in guntur district
గుంటూరులో కరోనా కేసులు
author img

By

Published : Jul 2, 2020, 10:16 AM IST

గుంటూరు జిల్లాలో బుధవారం ఒక్కరోజే 117 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కొత్త ప్రాంతాలకు వైరస్ వ్యాపిస్తోంది. బుధవారం తాడేపల్లి మండలంలో 25, తెనాలి 8, మంగళగిరి 3, పెదకాకాని 4, మాచర్ల 4, సత్తెనపల్లి 3, చిలువూరు 2, పెదకూరపాడు 2 కేసులు వచ్చాయి. తాడికొండ, చుండూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, కూచిపూడి, దుగ్గిరాల, వినుకొండ, చాకలిగుంట, కొప్పురావూరు, వేజండ్ల, దాచేపల్లిలో 1 కేసు చొప్పున నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో అత్యధిక కేసుల్లో గుంటూరు 654, నరసరావుపేట 257, తాడేపల్లి 190, మంగళగిరి 66, తెనాలి 70, పెదకాకాని 26, చిలకలూరిపేట 24, దాచేపల్లి 24 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1673కు చేరుకుంది.

నగరంలోని అధిక ప్రాంతాలకు విస్తరణ

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏటీ. అగ్రహారం 7, నెహ్రు నగర్, నల్ల చెరువు, ఎంప్లాయీస్ కాలని, లాలాపేట, యాదవ బజార్, బ్రాడిపేట, చంద్రమౌళి నగర్​లలో 2 కేసులు నమోదైనట్లు తెలిపారు. నల్లపాడు, వికాస్ నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, యస్.వి.యన్. కాలనీ, పోస్టల్ కాలనీ, చౌత్రా, కోబాల్ పేట, సీతానగర్, నల్లకుంట, సుబ్బారెడ్డి నగర్, రైల్ పేట, పాత గుంటూరు, గోరంట్ల, నాయుడు పేట, శ్రీ నగర్, డి.యస్.నగర్, శాంతి నగర్, పొత్తూరి వారి తోట, సంపత్ నగర్, ముత్యాల రెడ్డి నగర్, రైల్వే స్టేషన్ (ఆర్.పి.యఫ్. కానిస్టేబుల్)లో 1 కేసు నమోదైనట్లు వివరించారు.

కరోనాకు కేంద్రంగా తాడేపల్లి

జిల్లాలోని క్వారంటైన్లలో ఉన్న 6 గురికి కరోనా నిర్ధరణ అయింది. ఇక నరసరావుపేట, మాచర్లలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తాడేపల్లి మండల ప్రాంతం కరోనాకు కేంద్రంగా మారింది. అక్కడి నిన్న ఒక్కరోజే 25 కేసులు బయటపడటంతో ఆ ప్రాంతాన్ని మున్సిపల్ అధికారులు శుద్ధిచేశారు. ఆయా ప్రాంతాల్లో వచ్చిన కేసులకు సంభందించిన మూలాలను గుర్తించి వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు....

జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సమీక్ష సమావేశం నిర్వహించింది. కేసులు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో హైరిస్క్ ఉన్న వారికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. భవిష్యత్తులో గుంటూరు నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా అందరికీ పరీక్షలు చేయాలని అధికారాలు భావిస్తున్నారు.

ఇవీ చదవండి...

అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.