గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాప్తి చెందాయో అన్ని కోణాల్లో విశ్లేషించిన పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. గత నెలలో దిల్లీలో జరిగిన మత సమ్మేళనంలో 11 (దిల్లీ రిటర్న్స్) మంది ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు నిర్ధారించుకున్నారు. వారి నుంచి 26 మందికి (డైరెక్టు కాంటాక్టు) కరోనా వ్యాప్తి చెందింది. వీరిలో అత్యధికులు వారి కుటుంబీకులు, ప్రార్థన ప్రదేశాల్లో కలుసుకున్నవారే కావడం గమనార్హం. ఈ 26 మంది నుంచి మరో 106 మందికి వ్యాపించింది. అంటే కరోనా బారినపడిన వారిలో అత్యధికులు సెకండరీ కాంటాక్టు బాధితులేనన్నది స్పష్టమైంది. జిల్లాలో శనివారం నాటికి 209 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో అత్యధికంగా 143 కేసులు గుంటూరు అర్బన్ జిల్లా పోలీసుల పరిధిలోనే ఉన్నాయి. వీటిల్లో మూడు కేసులకు మాత్రం ఇంకా మూలాలు తెలియలేదు. ఈ మూడింటిలో ఒకటి విదేశీ రిటర్నీ కేసు కాగా రెండు కేసులకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకున్నా వారికి కరోనా సోకడం చర్చనీయాంశమవుతోంది.
ఇవీ చూడండి