ఆపదలో మనిషి ప్రాణాలను కాపాడేది రక్తమేనని... పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రక్షకభటులు రక్తదానాలు చేశారు. రక్తదానంపై ఉన్న అపోహలు వీడి యువత పెద్ద ఎత్తున రక్తదానం చేసి... ప్రమాద సమయాల్లో ప్రాణాలు నిలబెట్టేందుకు దోహదపడాలని పోలీస్ అధికారులు కోరారు. కడప, గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాలో పలువురు పోలీసు సిబ్బంది రక్తదానం చేసి...ఒంగోలులోని పోలీస్ కళ్యాణ పండపంలో ఓపెన్ హౌస్ పేరుతో పోలీసులు వినియోగిస్తున్న ఆయుధాల ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. అమరవీరుల ఆశయాలను కోనసాగించడమే వారికి మనమిచ్చే ఘన నివాళి అని...రక్తదానం చేయటం వల్ల ప్రాణాలు కాపాడినవారిమౌతామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ఏపీ హైకోర్టును దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉంచాలి: చీఫ్ జస్టిస్