గుంటూరు జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి మాస్క్ ధరించి.. భౌతిక దూరాన్ని పాటించాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ కె. ఈశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. తెనాలిలో ప్రభుత్వాసుపత్రిని ఆయన పర్యవేక్షించారు. కొవిడ్ సోకిన వారికి చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గదులను ఆయన పరిశీలించారు.
కాలేజీ విద్యార్థులు కనీసం మాస్కులు కూడా ధరించడం లేదని ఆరోపించారు. సోమవారం ఒక్కరోజే తెనాలిలో 8 కేసులు నమోదు కావడం ప్రజల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. వారిలో ఇద్దరికి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొవిడ్ సోకినా.. ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి