ETV Bharat / state

'ఇది అత్యంతర అరుదైన కేసు కాదు.. ఉరిశిక్ష విధింపు సరికాదు' - B.Tech student Ramya murder case updates

గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడికి దిగువ కోర్టు విధించిన ఉరి శిక్ష తీర్పును సవాలు చేస్తూ దోషి శశికృష్ణ హైకోర్టులో పిల్ వేశారు. ఉరి శిక్ష విధించడానికి ఇది అత్యంతర అరుదైన కేసు కాదని పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. యుక్త వయసులో ఉన్నవారికి ఉరి శిక్ష విధింపు సరికాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : May 13, 2022, 4:47 AM IST

బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో విచారణ కోర్టు విధించిన ఉరి శిక్ష తీర్పును సవాలు చేస్తూ దోషి శశికృష్ణ దాఖలు చేసిన అప్పీల్​పై హైకోర్టు విచారణ జరిపింది. అప్పీల్దారు తరఫున న్యాయవాది చల్లా అజయ్ కుమార్ వాదనలు వినిపించారు. ఉరి శిక్ష విధించడానికి ఇది అత్యంతర అరుదైన కేసు కాదన్నారు. మృతురాలి బంధువులకు ప్రభుత్వం రూ.18.25 లక్షలు పరిహారంగా ఇవ్వడం.. విచారణ కోర్టుపై ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. యుక్త వయసులో ఉన్నవారికి ఉరి శిక్ష విధింపు సరికాదన్నారు. అనంతరం విచారణను ఈనెల 19 కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.మన్మథరావు , జస్టిస్ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.

అత్యంత ఆరుదైన కేసుగా భావించి దిగువ కోర్టు ఉరిశిక్ష విధించిందని అప్పీల్​లో పేర్కొన్నారు. అత్యంత అరుదైన కేసు కాదని భావించడంలో విచారణ కోర్టు విఫలమైందని తెలిపారు. కేసు మొత్తం పరిస్థితుల సాక్ష్యం ఆధారంగా జరిగిందనే అంశాన్ని గుర్తించడంలో విచారణ కోర్టు విఫలమైందన్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు కోర్టు ముందు ఉంచిన సీసీ టీవీ ఫుటేజ్ సక్రమంగా కనిపించడం లేదని అప్పీల్​లో తెలిపారు. నేర నిరూపణకు ఆ సీసీ టీవీ ఫుటేజ్ సాక్ష్యంగా సరిపోదన్నారు. ఈ కేసులో ఉరి శిక్ష విధించడం చట్ట విరుద్ధమని.. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని విచారణ కోర్టు విధించి.. ఉరి శిక్షను రద్దు చేయండి అని కోరారు. ఇంజినీరింగ్ విద్యార్థిని నల్లపు రమ్యను ప్రేమోన్మాదంతో దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు కుంచాల శశికృష్ణకి ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు ప్రత్యేక సెషన్స్ న్యాయస్థానం / 4వ ఏడీజే కోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 29న సంచలన తీర్పు ఇచ్చింది.

ఇదీ చదవండి: గుంటూరు ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి ఉరిశిక్ష ఖరారు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.