వేతనాలు చెల్లించాలంటూ ఒప్పంద వ్యాయామ ఉపాధ్యాయులు ఆందోళన బాటపడ్డారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద నిరసనకు దిగారు. గత వ్యాయామ ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో కొందరి అర్హులను గత ప్రభుత్వం ఒప్పంద ప్రాతిపదికన నియమించిందని తెలిపారు.
ప్రభుత్వం మారినప్పటి నుంచి జీతాలు నిలిపేశారని వారంతా వాపోయారు. అప్పటి నుంచి జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని ఆందోళనకారులు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు 13 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పూట గడవక తమ కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.