అమరావతిలో 45వ రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళన - మాజీ ఎంపీ మాగంటి బాబు
అమరావతిలో 45వ రోజూ రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడి, తుళ్లూరు సహా అన్ని చోట్లా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రాజధానుల ప్రకటన ఉపసంహరించుకోవాలని... రాజధానిపై ప్రభుత్వం మనసు మారాలంటూ దేవాలయాల్లో మహిళలు పూజలు నిర్వహించారు. రైతులకు మద్దతుగా వెలగపూడి నిరసన దీక్షలో మాగంటిబాబు పాల్గొన్నారు. ఈ దీక్షలో వైకాపా వర్గానికి చెందిన రైతులూ పాల్గొన్నారు. దిల్లీ స్థాయిలో ఆందోళనకు రైతులు సిద్ధం కావాలని మాగంటి బాబు పిలుపునిచ్చారు. వేర్వేరు చోట్లకు పాలన మార్చటమేంటో అర్థం కావట్లేదని ఆయన అన్నారు.
అమరావతిలో కొనసాగుతున్న 45వ రోజు ఆందోళనలు
ఇవీ చదవండి: