ETV Bharat / state

'భాజపా, వైకాపా కుమ్మక్కై.. రాష్ట్ర భవిష్యత్​తో ఆడుకుంటున్నాయి' - congress meeting at uddandarayunipalem latest news update

ఉద్ధండరాయునిపాలెంలో కాంగ్రెస్ నేతలు పర్యటించారు. అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఈనెల 20 సదస్సు నిర్వహించనున్నట్లు నేతలు వెల్లడించారు. భాజపా, వైకాపాతో కుమ్మక్కై రాష్ట్ర ప్రజల భవిష్యత్​తో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

congress leaders visited uddandarayunipalem
ఉద్ధండరాయునిపాలెంలో పర్యటించిన కాంగ్రెస్ నేతలు
author img

By

Published : Nov 18, 2020, 5:42 PM IST

ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో అమరావతి ప్రాంతంలో ఈనెల 20న సదస్సు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. తుళ్లూరు మండలంలో అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఈ సదస్సు నిర్వహించనున్నామన్నారు. సదస్సు ఏర్పాట్లపై ఉద్ధండరాయునిపాలెంలో కాంగ్రెస్ నేతలు పర్యటించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇదే ప్రాంతంలో రాజధాని కోసం శంకుస్థాపన చేశారని.. అదే గ్రామం నుంచి ఆయన్ను ప్రశ్నిస్తామని రాష్ట్ర పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు మస్తాన్ వలి తెలిపారు. భాజపా నిర్ణయాలను ఇదే ప్రాంతం వేదికగా ఎండగడతామని కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు. రాజధాని రైతులతో పాటు, ఇతర పార్టీ నేతలు సైతం ఈ సదస్సులో పాల్గొంటున్నారని వారు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

రాజధాని విషయంలో సీఎం నిర్ణయం మారాలని నాగదేవతకు పూజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.