ETV Bharat / state

రసాభాసగా వైసీపీ విసృత్తస్థాయి సమావేశం.. కాలర్​ పట్టుకున్న ఇరు వర్గాల వైసీపీ నేతలు

CONFLICTS BETWEEN YCP LEADERS IN GUNTUR : గుంటూరులో జరిగిన వైసీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం రసాభాసగా మారింది. కాకుమాను మండల నాయకుల మధ్య విభేదాలు సమావేశం సందర్భంగా బయటపడ్డాయి. సమావేశంలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్న నాయకులు.. ఆ తర్వాత వాగ్వాదానికి దిగారు.

CONFLICTS BETWEEN YCP LEADERS
CONFLICTS BETWEEN YCP LEADERS
author img

By

Published : Jan 23, 2023, 2:10 PM IST

CONFLICTS BETWEEN YCP LEADERS : వైసీపీలో రోజురోజుకూ వర్గపోరులు బహిర్గతమవుతున్నాయి. ఒక వర్గానికి చెందిన నాయకులు.. తమను పట్టించుకోవడం లేదని మరో వర్గానికి చెందిన నాయకులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరులో నిర్వహించిన వైసీపీ సమావేశంలో ఇరు వర్గాల విభేదాలు కాస్తా.. కాలర్​ పట్టుకునే పరిస్థితికి వచ్చాయి.

ప్రత్తిపాడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కాకుమాను మండలంలోని పలువురు నాయకులు మధ్య విభేదాలు సమావేశం అనంతరం బయటపడ్డాయి. మండలానికి చెందిన నాయకులు ఒకరిపై ఒకరు సమావేశంలో ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత వాగ్వాదానికి దిగారు. పరిస్థితి కాలర్ పట్టుకునే అంతవరకు వెళ్లింది. స్థానికంగా ఉన్న పోలీసులు వివాదాన్ని సర్దుబాటు చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వల్లూరు, రేటూరు గ్రామాలకు చెందిన నాయకులు.. మండల కన్వీనర్​ను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమావేశంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే సుచరిత , నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.