గుంటూరు జిల్లా తెనాలిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బుర్రిపాలెం గ్రామంలోని వైకాపా నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. వైకాపా నాయకుల తీరుపై తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల చొరవతో ఆందోళనకారులను చెదరగొట్టి.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అధిక బలగాలను మోహరించి.. పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి...