central minister praveen pariwar : దేశంలోనే ప్రసిద్ధిగాంచిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ.. ఎయిమ్స్‌పై పలు ఫిర్యాదులు అందాయని.. కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ పరివార్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి, పానకాల నరసింహస్వామి వారిని.. భారతి ప్రవీణ్ పరివార్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కేంద్రమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పార్లమెంట్ ప్రభాస్ యోజన కార్యక్రమంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా పోలీసుల మధ్య సమన్వయలోపంతో కేంద్రమంత్రికి భద్రత కరవైంది. దీనిపై గుంటూరు తూర్పు డీఎస్‌పీ వివరణ కోరగా.. సమాచార లోపంతో జరిగిందేగానీ.. భద్రతను నిర్లక్ష్యం చేయలేదని వివరణ ఇచ్చారు.
నేను ఎయిమ్స్‌ను సందర్శించాను. అక్కడ నాకు పలు సమస్యలపై ఫిర్యాదులు అందాయి. వాటిని పరిష్కరించాలని.. ప్రజలకు ఉత్తమ సేవలు అందించడానికి కృషి చేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశాను. ప్రధాన మంత్రి జనారోగ్య యోజన పథకం చాలా గొప్ప పథకం. ఆంధ్రప్రదేశ్‌లో లబ్ధిదారులందరికీ ఆ పథకం ద్వారా అందాల్సిన పూర్తి సేవలు అందేలా చూస్తాం.
- కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ పరివార్
ఇవీ చదవండి :