Commission Secretary: రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌ను దూషించారన్న ఆరోపణలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ వివరణ ఇవ్వాల్సిందేనని కమిషన్ కార్యదర్శి శైలజ తేల్చి చెప్పారు. ఇవాళ కేవలం విచారణ కోసమే రమ్మన్నాం తప్ప శిక్షించేందుకు కాదని స్పష్టం చేశారు. కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. బుధవారం కార్యాలయానికి వచ్చి సమాధానం చెప్పాల్సిందేనన్నారు.
మహిళా కమిషన్ పరిధి ఏంటో సభ్యురాలిగా పనిచేసిన తెదేపా మహిళా విభాగం అనితకు తెలియదా అని కమిషన్ సభ్యురాలు గజ్జెల లక్ష్మి ప్రశ్నించారు. తెదేపా హయాంలో మహిళలపై దాడులు జరగలేదా అని నిలదీశారు. కమిషన్ ఛైర్‌పర్సన్‌నే నానా మాటలు అన్న బొండా ఉమాపై చర్యలు తీసుకోకపోతే మిగిలిన వారి పరిస్థితి ఏంటని మరో సభ్యురాలు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: MLA Dance: వివాహ వేడుకలో స్టెప్పులేసిన ఎమ్మెల్యే రెడ్డి శాంతి