గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రారంభించారు. ఉప సభాపతి కోన రఘుపతి పాల్గొన్నారు. రూ.3.31 కోట్లతో నిర్మించనున్న చంద్రకళాపార్కు, రీడింగ్ రూమ్, సులభ్ కాంప్లెక్స్, బస్టాండ్, విస్తరించిన రహదారి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
బాపట్లను జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని జిల్లా పాలనాధికారి అన్నారు. ఇందుకోసం స్థానికులు తమ స్థలాలను త్యాగం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జమ్ములపాలెం రోడ్డులో రూ.500 కోట్లతో వైద్య కళాశాల, ఐదొందల పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు త్వరలో భూమిపూజ చేస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహనతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. తండ్రిని మించిన తనయుడని సీఎంను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ భానుప్రతాప్, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు