గుంటూరు జిల్లా చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేశారు. నియోజకవర్గ పరిధిలో ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ, ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు, ఐదుగురు హోంగార్డులు కోవిడ్ బారిన పడ్డారు.
అలాగే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఒక వీఆర్వో గ్రామ సచివాలయంలో విధుల్లో ఉన్న ఒక ఉద్యోగికి కూడా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులందరికీ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చూడండి