ETV Bharat / state

మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల తొలగింపు..ఆందోళన

మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు విద్యాశాఖ అధికారి మధ్య వాగ్వివాదం ఎక్కువ కావటంతో భోజన పథక నిర్వాహకులు విద్యాశాఖ అధికారిని నిర్భందించిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో జరిగింది.

మమ్మల్ని ఎందుకు తొలగించారయ్యా
author img

By

Published : Jul 18, 2019, 9:07 AM IST

మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల తొలగింపు..ఆందోళన

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను విధుల నుంచి తొలగించారు. ఏ కారణంతో తొలగించారని ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించగా ఉన్నతాధికారులు తొలగించాలని సూచించారని చెప్పారు. దీంతో నిర్వాహకులు విద్యాశాఖ అధికారిని ప్రశ్నించగా. 'నేను ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేద'ని సమాధానం చెప్పడంతో నిర్వాహకులు కోపోద్రిక్తులయ్యారు. తమకు సరైన సమాధానం చెప్పాలంటూ వాగ్వివాదానికి దిగారు. తమకు సమాధానం చెప్పకుండా ఎక్కడకి కదిలేది లేదంటూ ఆయన గది ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిడి వల్లే తమను విధుల్లోంచి తొలగించారని నిర్వాహకులు వాపోతున్నారు. అనంతరం త్వరగతిన న్యాయం చేయాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి: ''పదోన్నతుల్లో నిబంధనలు పాటించరా?''

Intro:తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మేజర్ పంచాయతీ కార్మికులు సి ఐ టి యు ఆధ్వర్యంలో గురువారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా సిఐటియు కార్యదర్శి టెడ్డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపాలిటీ ఉద్యోగుల మాదిరిగా మేజర్ పంచాయతీ కార్మికులకు సమాన వేతనాలు అమలు చేయాలని కోరారు. కార్మికులకు విధినిర్వహణలో ప్రత్యేక రక్షణ కల్పించాలన్నారు. నెలల నా నిత్యావసర సరుకులు, ఏకరూప దుస్తులు వంటివి అందజేయాలన్నారు. బ్యాంకుల నుండి వేతనాలు చెల్లింపు చేయాలని డిమాండ్ చేశారు.

Body:h

Conclusion:j

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.