రైతులు, మహిళలు, యువతరం మద్దతు తెదేపాకే ఉందని అధినేత చంద్రబాబు తెలిపారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ చేశారు. తెదేపాకు ఉన్న ప్రజాదరణ చూసి వైకాపా నేతలు ఓర్వలేకేనిందలు వేస్తున్నారని విమర్శించారు. వివేకానందరెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య వాళ్ల ఊళ్లో, వాళ్ల ఇంట్లో జరిగితే... తెదేపాపై నెపం వేయడం అమానుషమని చెప్పారు. తప్పులు చేసి తప్పించుకోవడంలో జగన్ ఆరితేరారన్నారు. వివేకా హత్యలో వాస్తవాలన్నీ బయటకు తీస్తామని... అన్ని అంశాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..