ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని సీఎం జగన్ అన్నారు. వాటర్ గ్రిడ్ పథకం కింద 3 దశల్లో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లా అంతటికీ వర్తింపచేయాలని జగన్ తెలియజేశారు. తాగునీటి సరఫరాపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్ అధికారులు, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా...మొదటిదశలో శ్రీకాకుళం, ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాల్లో పరిశుభ్రమైన తాగునీరు ఇవ్వాలని సీఎం తెలిపారు. రెండోదశలో విజయనగరం, విశాఖ, రాయలసీమ జిల్లాల్లో శుభ్రమైన నీరు ఇవ్వాలన్నారు. మూడో విడతలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో తాగునీరు ఇవ్వాలని సీఎం వెల్లడించారు.
నీటిని తీసుకున్నచోటే శుద్ధిచేసి అక్కడి నుంచే పంపిణీ చేయాలని ప్రాథమిక నిర్ణయం, నిశిత అధ్యయనం చేసి, ప్రణాళిక ఖరారు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. తాగునీటి చెరువులు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. తాగునీరు నింపాక కలుషితం కాకుండా తగిన ఆలోచనలు చేయాలని సీఎం తెలిపారు. కిడ్నీ బాధిత ప్రాంతాల్లో ట్రీట్‌మెంట్‌ప్లాంట్ నుంచి నేరుగా ఇళ్లకే తాగునీటిని పంపిణీచేయాలని జగన్ అన్నారు.
ఇదీ చదవండి