ETV Bharat / state

CM Jagan Suggests AI: టీచర్ల కొరతను ఏఐతో అధిగమించండి.. పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం సూచన - cm jagan

CM Jagan Suggests use AI to overcome teachers shortage: పాఠశాల విద్యలో అంతర్జాతీయ ప్రమాణాల దిశగా తీసుకోవాల్సిన చర్యలపై పరిశీలన, అధ్యయనం చేయాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్‌ విద్యలో ఐబీ సిలబస్‌పై చర్చించారు. టీచర్ల కొరతను.. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో అధికమించాలని సీఎం అధికారులకు సూచించారు.

CM Jagan Review Meeting on Education Department
cm_jagan_review_meeting_on_education_department
author img

By

Published : Aug 14, 2023, 9:53 PM IST

Updated : Aug 15, 2023, 6:22 AM IST

CM Jagan Review Meeting on Education Department: విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్షించారు. పాఠశాల విద్యలోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన విద్యా విధానాలు అందాలని సీఎం ఆదేశించారు. దీనిపై పరిశీలన, అధ్యయనం చేయాలన్నారు. స్టూడెంట్స్ ప్రయోజనాలు నెరవేర్చేలా, మన విద్యావ్యవస్థ అవసరాలను, విద్యార్థుల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ అధ్యయనం చేయాలన్నారు. ఏపీలో ఒక విద్యార్థి పదోతరగతి సర్టిఫికెట్‌ తీసుకున్నా, ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నా వాటికి ప్రపంచంలో ఎక్కడైనా.. విలువైనదిగా ఉండాలన్నదే లక్ష్యమన్నారు.

శాస్త్రసాంకేతిక, ఆర్థిక, వ్యాపారం, ఇతర రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యంగా ఉండాలని సీఎం సూచించారు. సాధారణ ఆలోచనలతో కాకుండా మెరుగైన ఆలోచనలతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించే ప్రక్రియ కొనసాగాలన్నారు. నాయకులుగా ఉన్న వ్యక్తులు మార్పులను స్వాగతిస్తూ.. పేద విద్యార్థులకు మంచి జీవితాన్ని అందించాలన్నారు. సులభంగా నేర్చుకునే విధానాన్ని, విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేలా, వారిలో సృజనాత్మకత పెంచేందుకు నిరంతరం కృషిచేస్తున్నట్లు తెలిపారు.

CM REVIEW ON INCOME DEPARTMENTS: నాటు సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి: సీఎం జగన్

విద్యార్ధులతో పాటు తల్లిదండ్రులకూ విద్యావిధానంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్గించాలని సీఎం సూచించారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌లో మరిన్ని అంశాలను నేర్చుకునేందుకు వీలుగా ఇంటర్నేషనల్‌ అకడమిక్‌ కమ్యూనిటీలో ప్రసిద్ధ సంస్థలను భాగస్వామ్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పైలట్‌ పద్ధతిలో వివిధ సంస్థల కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని.. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్​లో క్రియేటర్లుగా మారడం ఎలా అన్నది మరొక ప్రధాన అంశమన్న సీఎం.. అందుబాటులో ఉన్న ఏఐని వాడుకుని దాన్ని బోధనలో, సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులను మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి కూడా ఏఐని వినియోగించుకోవాలని సీఎం అన్నారు. అధ్యాపకుల కొరత, కంటెంట్ల కొరతను నివారించడానికి ఏఐ వినియోగపడుతుందన్న సీఎం.. దీనిపైన ప్రధానంగా దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశించారు.

CM Jagan Review: పంటలకు కనీస మద్దతు ధర కల్పనకు.. ఏపీ ఎంఎస్‌పీ యాక్ట్​

ఉన్నత విద్యలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వినియోగంపై కార్యాచరణపై సీఎం ఆరా తీశారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు కోర్సు చివరభాగంలో ఏఐలో ప్రాథమిక అంశాలపై బోధించేలా ఏర్పట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు. ఏఐపై పరిశోధనకోసం యూనివర్శిటీల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించేలా సమగ్రమైన ఫౌండేషన్‌ కోర్సును అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు.

ప్రపంచస్థాయి సంస్థలతో డిజిటల్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయడంతో పాటు, పరిశోధనలో బోధనా పద్ధతులను, క్లాస్‌ రూం మేనేజ్‌మెంట్, వ్యక్తిగతంగా నేర్చుకునే విధానాలకోసం ఏఐని వినియోగించుకునే దిశగా అడుగులువేస్తున్నామని వెల్లడించారు. ఏఐ సహా దాని అప్లికేషన్ల వినియోగంలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని అధికారులు తెలిపారు.

CM Review meeting: క్యాలెండర్‌ ప్రకారం రైతులకు సాగునీరు విడుదల చేయాలి: సీఎం జగన్

Last Updated : Aug 15, 2023, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.