ETV Bharat / state

'మత్స్యకారుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాం'

వైఎస్​ఆర్​ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. మూడేళ్లలో రాష్ట్రంలో 8 మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు, ఒక ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

cm-jagan-starts-ysr-matsyakara-bharosa-scheme

author img

By

Published : May 6, 2020, 3:39 PM IST

ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం

కరోనా విపత్తు వేళ ప్రభుత్వానికి అనేక కష్టాలు ఉన్నప్పటికీ... మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ అన్నారు. జాలర్ల కుటుంబాలకు 10 వేల రూపాయల చొప్పున సాయం అందించేందుకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. మంత్రి మోపిదేవి, సీఎస్‌ నీలం సాహ్ని పలువురు మత్స్యకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షా 9వేల కుటుంబాలకు పైగా లబ్ధి చేకూర్చనున్నామని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

'కరోనాపై పోరులో ప్రభుత్వానికి చాలా కష్టాలు ఉన్నాయి. అయినా మత్స్యకారుల కష్టాలు మరింత పెద్దవిగా భావించే వారికి సాయం చేస్తున్నాం. గతంలో వేట నిషేధ సమయంలో 4 వేల రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు లక్షా 9 వేల కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నాం. మత్స్యకారుల డీజిల్‌ రాయితీ రూ.6 నుంచి రూ.9కి పెంచాం. నెలకు మెకనైజ్డ్‌ బోటుకు 3 వేల లీటర్లు, మోటారైజ్డ్‌ బోటుకు 300 లీటర్ల డీజిల్ ఇస్తున్నాం. చేపల వేటకు వెళ్లి ఎవరైనా మరణిస్తే రూ.10 లక్షలు ఇస్తున్నాం. మన మత్స్యకారులు గుజరాత్‌, ఇతర చోట్లకు వలస వెళ్లకుండా పలు చర్యలు చేపడుతున్నాం. 3 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో 8 మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు, ఒక ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రం నిర్మిస్తున్నాం' అని సీఎం జగన్ తెలిపారు.

ఇదీ చదవండి

75 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో రిట్ పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.