ETV Bharat / state

అంగన్‌వాడీ పిల్లలకు ఇచ్చే న్యూట్రిషన్‌ కిట్‌ నాణ్యతలో రాజీ వద్దు: సీఎం జగన్​

CM JAGAN ON : అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మహిళ, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష చేసిన సీఎం.. సకాలంలో నాడు-నేడు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు.

CM JAGAN ON ANGANWADI
CM JAGAN ON ANGANWADI
author img

By

Published : Dec 15, 2022, 5:28 PM IST

CM JAGAN ON ANGANWADI : అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులపై దృష్టి సారించాలని అధికారులను సీఎం జగన్​ ఆదేశించారు. మహిళ, శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలన్న జగన్​.. సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంగన్‌వాడీలకు సార్టెక్స్‌ బియ్యం సరఫరా చేయాలని సీఎం జగన్‌ సూచించారు. అంగన్‌వాడీ పిల్లలకు ఇచ్చే న్యూట్రిషన్‌ కిట్‌ నాణ్యతలో రాజీ వద్దని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సూపర్‌వైజర్లు తనిఖీ నిర్వహించాలన్న సీఎం.. తనిఖీలు, నాణ్యత, నాడు-నేడులో కచ్చితమైన మార్పు కనిపించాలన్నారు.

61 C.D.P.O పోస్టుల భర్తీకీ సీఎం ఆమోదం తెలిపారు. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని అధికారులు తెలపగా... ఇతర ఖాళీలనూ త్వరగా భర్తీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.