ETV Bharat / state

నాణ్యమైన విద్య కోసం విప్లవాత్మక సంస్కరణలు: సీఎం జగన్​

CM JAGAN REVIEW : నాడు నేడు చేపట్టిన ప్రతి స్కూలుకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉండాలని.. ఆ దిశగా అధికారులు కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకూ ' టీచర్స్‌ కాన్సెప్ట్‌' సమర్థవంతగా అమలు చేయాలని ఆదేశించారు. 2024–25లో సీబీఎస్‌ఈ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మరింత తోడుగా నిలవడానికి బోధనలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. డిజిటలైజేషన్‌ ప్రక్రియలో భాగంగా పాఠశాలలో ఉన్న ప్రతి క్లాస్‌రూం డిజిటలైజేషన్‌ కావాలని సీఎం నిర్దేశించారు. గోరుముద్ద అమలు ప్రక్రియ కూడా పక్కాగా ఉండాలని ఆదేశించారు.

CM JAGAN REVIEW
CM JAGAN REVIEW
author img

By

Published : Nov 3, 2022, 8:41 PM IST

CM REVIEW ON EDUCATION : విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. గత సమీక్షల్లో తీసుకున్న నిర్ణయాలు.. అమలు జరుగుతోన్న వైనం సహా తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై చర్చించారు. విద్యారంగంలో నాణ్యమైన విద్యకోసం విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపిన సీఎం.. రాష్ట్రంలో తొలిసారిగా బడులు ప్రారంభమ్యయ్యే తొలిరోజునే విద్యాకానుక కిట్‌ ఇస్తున్నామన్నారు. వీటన్నింటినీ పిల్లలకు స్కూల్‌ ప్రారంభించే తొలిరోజే అందిస్తున్నామన్నారు.

మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకూ 'టీచర్స్‌ కాన్సెప్ట్‌' సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. నిరంతరం పర్యవేక్షిస్తూ పిల్లలకు సబ్జెక్టుల వారీగా అత్యుత్తమ బోధన అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 45వేల స్కూళ్లను బాగు చేయాలంటే కనీసం 3–4 యేళ్లు పడుతుందన్న సీఎం.. ప్రస్తుతం నాడు - నేడు 15 వేల స్కూళ్లలో జరిగిందన్నారు. ఈ సంవత్సరం మరో 22 వేల స్కూళ్లలోనూ, ఆ తర్వాత సంవత్సరం మిగిలిన స్కూళ్లలోనూ దశల వారీగా జరుగుతుందని.. పనుల పూర్తికి మరో 3–4 సంవత్సరాలు పడుతుందన్నారు. డిజిటలైజేషన్‌ ప్రక్రియలో భాగంగా ప్రతి క్లాస్‌రూం డిజిటలైజేషన్‌ కావాలని సీఎం నిర్దేశించారు.

గోరుముద్ద అమలు ప్రక్రియ కూడా పక్కాగా ఉండాలన్న సీఎం.. ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌ నిర్వహణకు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఇప్పటివరకు వెయ్యి స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ వచ్చిందని సీఎంకు అధికారులు తెలిపారు. నాడు–నేడు చేపట్టిన ప్రతి స్కూలుకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉండాలన్నారు. బైజూస్‌ కంటెంట్‌ను పాఠ్యప్రణాళికలో పొందుపరుస్తున్నామని అధికారులు తెలిపారు.

ఏప్రిల్‌ 2023లోగా తరగతి గదుల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 2024–25లో సీబీఎస్‌ఈ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మరింత తోడుగా నిలవడానికి బోధనలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పాఠశాల విద్య పనితీరు సూచికల్లో రాష్ట్రం అద్భుత పనితీరు కనపరిచినట్లు అధికారులు తెలిపారు. పీజీఐలో అగ్రశ్రేణి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ చేరినట్లు తెలిపారు. దీనికోసం కృషి చేసిన అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.