ఎల్‌ఐసీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ ఛైర్మన్లు ఎం.ఆర్.కుమార్, గిరీష్ రాధాకృష్ణన్‌కు ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ప్రధాని జన జీవన్ బీమా, ఆమ్ ఆద్మీ బీమా యోజన క్లెయిమ్స్ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని సురక్షా బీమా యోజన పెండింగ్ క్లెయిమ్స్ పరిష్కరించాలని లేఖలో కోరారు. కరోనా, లాక్‌డౌన్ వల్ల ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారిందని లేఖలో వెల్లడించిన సీఎం... అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని పేర్కొన్నారు. క్లెయిమ్స్ వెంటనే చెల్లించాలని కోరారు.
ఇదీ చదవండి