ETV Bharat / state

మంత్రులు లేకుండానే.. గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్‌ సమీక్ష - సచివాలయాల్లో ఖాళీల వివరాలు

Jagan holds review meet: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. భర్తీని పారదర్శకంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరు నాటికి అన్నిచోట్లా ముఖ గుర్తింపు హాజరు అమలు చేయాలని ఆదేశించారు. సుస్థిర ప్రగతి లక్ష్యాలపై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. సంబంధిత శాఖల మంత్రులు లేకుండానే ముఖ్యమంత్రి ఈ సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశమైంది.

Jagan holds review meet
గ్రామ వార్డు సచివాలయాలపై సీఎం సమీక్ష
author img

By

Published : Jan 4, 2023, 7:32 PM IST

గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్‌ సమీక్ష

Chief Minister YS Jagan Mohan Reddy: గ్రామ, వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. కీలకమైన ఈ సమీక్షను సంబంధిత శాఖల మంత్రులు లేకుండానే నిర్వహించారు. ప్రతి సారీ సమీక్షకు పంచాయతీ రాజ్, పురాపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను తప్పనిసరిగా పిలిచేవారు. ఈ సారి మాత్రం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ను సమావేశానికి ఆహ్వానించలేదు. కేవలం అధికారులతో మాత్రమే సమీక్షి నిర్వహించిన సీఎం పలు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.

గ్రామ, వార్డు ఉద్యోగాల భర్తీ: సచివాలయాల్లో మెరుగైన పనితీరు, సమగ్ర పర్యవేక్షణ, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో సచివాలయాల పాత్ర, సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీల భర్తీ తదితర అంశాలపై సీఎం సమగ్రంగా సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఆయా ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారని, అలాగే మళ్లీ ఎలాంటి లోపం లేకుండా సమర్థవంతంగా నియామక ప్రక్రియను చేపట్టాలని అధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ఖాళీల వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. భర్తీ కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ హాజరు: ఈ నెలాఖరు కల్లా రాష్ట్రసచివాలయం నుంచి గ్రామస్థాయి సచివాలయం వరకూ కూడా ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ హాజరు అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అన్ని గ్రామ సచివాలయాలను వైర్డ్‌ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌తో నడుస్తున్న 2వేల 909 గ్రామ సచివాలయాలనూ.. వైర్డ్‌ ఇంటర్నెట్‌తో అనుసంధానించాలని అధికారులకు తెలిపారు. గ్రామంలోని ఆర్బీకేలు, విలేజ్‌ సెక్రటేరియట్స్‌లోనూ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని సీఎం ఆదేశించారు. అంగన్‌వాడీలనూ సచివాలయాల పర్యవేక్షణలోకి తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన: గ్రామ,వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటలనుంచి 5 గంటలవరకూ స్పందన నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ విభాగాల వారీగా మండలాల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని, రిపోర్టింగ్‌ స్ట్రక్చర్‌ పటిష్టంగా ఉండాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై విభాగాల వారీగా మండల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎవరెవరు ఏం చేయాలన్న దానిపై చాలా స్పష్టత ఉండాలన్నారు. విధులు, బాధ్యతలపై ఎస్‌ఓపీలు ఉండాలని, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

అర్జీల పరిష్కారం: అర్జీల పరిష్కారం చాలా ముఖ్యమైనదని, వాటి పరిష్కారంలో నాణ్యత ఉండాలన్నారు. అర్జీ పరిష్కారానికి నోచుకోకుండా మరో సారి వచ్చినపుడు రీ వెరిఫికేషన్‌ కోసంపై వ్యవస్థకు వెళ్లాలని, ఈ అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ శాఖాధిపతులు ప్రతి నెల 2 సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలని సీఎం నిర్దేశించారు. సచివాలయాల్లో సాంకేతిక పరికరాల విషయంలో ఎలాంటి లోపం ఉండకూదని, టెక్నాలజీ పరంగా,సాంకేతిక పరికరాల పరంగా వారికి లోటు ఉండకూడదన్నారు.నిరంతరం టెక్నాలజీని అప్‌డేట్‌ చేయాలన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.