ETV Bharat / state

CM Jagan Foundation Stone for 3 Renewable Energy Projects: గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రాష్ట్రాన్ని ముందుంచేలా అడుగులు : సీఎం జగన్

CM Jagan Foundation Stone for 3 Renewable Energy Projects: భవిష్యత్‌ను శాసించే గ్రీన్‌ ఎనర్జీ రంగంలో.. రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచేలా అడుగులు వేస్తున్నామని.. ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు... సీఎం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

CM _Jagan_Foundation_Stone_for_3_Renewable_Energy_Projects

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2023, 4:12 PM IST

CM Jagan Foundation Stone for 3 Renewable Energy Projects: రాష్ట్రంలో మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లా యాగంటిలో వెయ్యి మెగా వాట్లు, అనంతపురం జిల్లా కమలపాడులో 950 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే నంద్యాల జిల్లా పిన్నాపురంలో గ్రీన్​ కో ఎనర్జీ 2వేల 300 మెగావాట్ల సౌర విద్యుత్​ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఏపీజెన్​కో, ఎన్​హెచ్​పీసీ సంయుక్తంగా పంప్డ్​ స్టోరేజీ ప్రాజెక్టుల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. రెండు పీఎస్సీల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్​ సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు.

CM Jagan Inaugurates Hyatt Place Hotel in Vijayawada: ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో ఏపీకి ప్రత్యేక స్థానం.. అదే లక్ష్యం: సీఎం జగన్​

MOU for Pumped Storage Projects: ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. పంప్డ్​ స్టోరేజీ ప్రాజెక్టు(Pumped Storage Projects) వల్ల బొగ్గు ఆధారిత విద్యుత్​పై ఆధారపడటం తగ్గుతుందన్నారు. అలాగే రాబోయే రోజుల్లో పంప్డ్​ స్టోరేజీ ప్రాజెక్టులు ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. పర్యావరణ హితంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని స్పష్టం చేశారు. సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. సోలార్‌ ఎనర్జీ కోసం 2రూపాయల 49 పైసలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుల కోసం NHPC (National Hydroelectric Power Corporation) తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్‌ విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేసే విషయంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు.

CM Jagan: 'నేతన్న నేస్తం' నిధులు విడుదల చేసిన సీఎం.. 'సేవకులపైనే విమర్శలా..?'

"రైతులకు ఉచిత్ విద్యుత్‌కు ఢోకా లేకుండా.. కరెంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నాం. 41 వేల మెగావాట్లకు చెందిన పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులను గుర్తించాం. ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకు వస్తున్న సంస్థలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నాం."- వైఎస్​ జగన్​, ముఖ్యమంత్రి

CM Jagn Tributes to Tanguturi Prakasam Panthulu: అంతకుముందు స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ప్రకాశం పంతులు (Tanguturi Prakasam Panthulu Birth Anniversary) చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

CM Jagan review: గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి.. సమీక్షలో సీఎం జగన్​

Jagan Review on Sports: 'ఆడుదాం ఆంధ్ర' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.