ETV Bharat / state

ప్రకటనలకే పరిమితమైన జగన్​ మాటలు.. ఇప్పటికీ ట్రిపుల్‌ఐటీలకు నో వీసీ - సీఎం హామీలు

CM JAGAN ON EDUCATION SYSYTEM : రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తామన్న సీఎం హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల దశ, దిశ మారుస్తామని.. అధ్యాపకుల ఖాళీలు భర్తీ చేస్తామని మూడేళ్ల క్రితం ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. పైగా బోధనా రుసుముల్లో కోతలతోపాటు , విశ్వవిద్యాలయాల నిధులు సైతం ప్రభుత్వం బలవంతంగా లాగేసుకుంటోంది. ట్రిపుల్‌ ఐటీలకు కనీసం వీసీలను నియమించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది.

CM JAGAN ON EDUCATION SYSYTEM
CM JAGAN ON EDUCATION SYSYTEM
author img

By

Published : Nov 7, 2022, 6:54 AM IST

Updated : Nov 7, 2022, 7:21 AM IST

ప్రకటనలకే పరిమితమైన జగన్​ మాటలు

CM JAGAN ON EDUCATION : ప్రభుత్వ విశ్వవిద్యాలయాల దశ, దిశ మారుస్తామని.. ఖాళీలు భర్తీ చేస్తామని మూడున్నరేళ్లుగా సీఎం జగన్ ప్రకటనలు బుట్టదాఖలయ్యాయి. అన్ని వర్సిటీల్లో కలిపి 3,864 బోధనా సిబ్బంది పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 1,100 మందే పనిచేస్తున్నారు. 71శాతానికిపైగా బోధనా సిబ్బంది ఖాళీలు ఉన్నాయి. మరో 3, 4 నెలల్లో పదవీ విరమణ చేసే వారు అధికంగా ఉన్నారు. ఒకపక్క నియామకాలు చేపట్టకపోగా,.. వర్సిటీల్లోని నిధులను ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలంటూ ప్రభుత్వమే లాగేసుకుంటోంది. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామంటూనే కోతలు విధిస్తోంది.

2020-21లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు నాలుగో త్రైమాసిక ఫీజును చెల్లించలేదు. ఈ మొత్తాన్ని చాలా కళాశాలలు విద్యార్థుల నుంచే వసూలు చేశాయి. 2020-21నుంచి ప్రైవేటు కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులకు ఫీజుల చెల్లింపును ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పీజీ చదివేవారు తగ్గిపోయారు. ట్రిపుల్‌ఐటీలకు సంబంధించి ఉపకులపతినే నియమించలేకపోయింది. ఒంగోలు ట్రిపుల్‌ఐటీ నిర్మాణ స్థలాన్ని మార్పు చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత పట్టించుకోవడమే మానేసింది.

విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, సిబ్బంది పోస్టులను తక్షణం భర్తీ చేస్తామని.. మంచి అర్హత కలిగిన వారిని నియమిస్తామని చెప్పినా.. ఈ మూడున్నరేళ్లలో ఒక్క పోస్టూ భర్తీ చేయలేదు. 2వేల సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు నోటిఫికేషన్‌ రాలేదు. రాష్ట్రానికి గర్వకారణమైన ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఖాళీల గురించి గతంలో సీఎం జగన్ గతంలో ఎంతగా బాధపడ్డారో ఒకసారి చూద్దాం.

ఏటా రూ.100 కోట్లకు పైగా అదనపు ఖర్చు: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో దేశంలోనే 14వ స్థానంలో ఉండటం తన గుండెల్లో గుచ్చుకుంటోందంటూ సీఎం బాధను వ్యక్తం చేయడం చూశాం కదా...కానీ నేటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. వర్సిటీలో 936 పోస్టులకు గాను.. రెగ్యులర్‌ ఆచార్యులు 216 మందే ఉన్నారు. వర్సిటీకి నిధులు ఇవ్వకపోగా ఉన్నవాటినే రాష్ట్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలని లాగేసుకుంది. ఇప్పటికే కార్పొరేషన్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం 10కోట్లు డిపాజిట్‌ చేసింది. మంజూరైన పోస్టులకు జీతభత్యాలు, పింఛన్లకు 366 కోట్లు, మినిమం టైం స్కేల్లో పనిచేసేవారికి 26 కోట్లు కావాలి. కానీ ప్రభుత్వం అన్నింటికీ కలిపి 280 కోట్లే ఇస్తోంది. దీంతో విశ్వవిద్యాలయం.. ఫీజులు, ఇతర ఆదాయం నుంచి ఏటా 100 కోట్లకు పైగా అదనంగా ఖర్చుచేస్తోంది.

ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్న చందంగా ట్రిపుల్‌ ఐటీలు: ట్రిపుల్‌ ఐటీలను గత ప్రభుత్వం నాశనం చేసిందని.. వాటికి పూర్వవైభవం తీసుకొస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్న చందంగా మారాయి ట్రిపుల్‌ ఐటీల పరిస్థితి. మొత్తం ట్రిపుల్‌ ఐటీల్లో 665 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడున్నరేళ్లలో కనీసం ఉపకులపతినే నియమించలేకపోయారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డినే ఇన్‌ఛార్జి ఉపకులపతిగా కొనసాగిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో ట్రిపుల్‌ఐటీ భవన నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. దూబగుంట నుంచి కనిగిరి మండలం బల్లిపల్లికి ట్రిపుల్‌ఐటీని మార్చింది. భవన నిర్మాణాలు, వసతికి 12 వందల కోట్లు అవసరం కాగా...తొలిదశ పనులకు 200 కోట్లు కేటాయించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఒక్క పైసా విదల్చకపోవడంతో పనులు మొదలు కాలేదు. శ్రీకాకుళంలోనూ ఇదే పరిస్తితి ఉండటంతో ఈ రెండు కళాశాలలకు చెందిన విద్యార్థులను నూజివీడు, ఇడుపులపాయలో సర్దుబాటు చేశారు. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఇంతవరకు న్యాక్‌ గుర్తింపే లభించలేదు.

విద్యార్థుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రైవేట్​ కళాశాలలు: పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కావొద్దన్న ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామని సీఎం గొప్పలు చెప్పారు. కానీ అన్నింటా కోతలే విధిస్తున్నారు. 2020-21లో కరోనాతో కళాశాలలు సరిగా నిర్వహించలేదంటూ నాలుగో త్రైమాసిక ఫీజు దాదాపు 650 కోట్లు ప్రభుత్వం చెల్లించలేదు. కానీ కళాశాలల మాత్రం విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఈ మేరకు వసూలు చేసుకున్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో పీజీ కోర్సులకు బోధన రూసుం 2020-21 నుంచి నిలిపివేయడమే గాక.. అప్పటి వరకు ఉన్న బకాయిలనూ చెల్లించలేదు. దాదాపు 450 కోట్లు చెల్లించాల్సి ఉన్నా.. ఏదో సాకులు చెబుతూ దాటవేస్తోంది.

ధ్రువపత్రాలను కళాశాలల్లోనే వదిలేస్తున్న విద్యార్థులు: కళాశాలల నిర్వహణలో లోపాలున్నాయని విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్‌ నివేదిక వచ్చినా మరోసారి ప్రత్యేక కమిటీలతో విచారణ చేయించారు. ఈ నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. కానీ, ఫీజుల బకాయిలను మాత్రం చెల్లించడం లేదు. దీంతో విద్యార్థుల నుంచే కళాశాలల యాజమాన్యం ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజు కట్టలేని వారు ధ్రువపత్రాలను కళాశాలల్లోనే వదిలేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 7, 2022, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.