తమ సమస్యలు పరిష్కరించాలంటూ గుంటూరులో సివిల్ సప్లయ్స్ వర్కర్స్ ఆందోళన బాట పట్టారు. జనవరి నుంచి బకాయి ఉన్న కార్మికుల వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు సమ్మె చేస్తామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా సప్లయ్స్ వర్కర్స్ కూలి రేట్లు గత డిసెంబర్ నాటికి ముగిసినప్పటికీ ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం నూతన కూలీ రేట్లను అమలు చేయలేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుంటూరు సివిల్ సప్లయ్స్ గూడెం వద్ద విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని.. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: