ETV Bharat / state

సోషల్ మీడియాలో పోస్టుల కేసు.. తెలుగు యువత అధ్యక్షుడికి నోటీసులు - తెలుగు యువత నేతకు నోటీసులు

CID Notices: ఇక్కడ అధికార పక్షానికి మాత్రం అలాంటి షరతులు వర్తించవు.. కేవలం ప్రతిపక్షంలో ఉన్న నేతలు, నాయకులు ఎదైనా చిన్న పోస్టు చేసినా.. లేదా షేర్ చేసినా వారిపై కేసులు పెట్టడం పరిపాటిగా మారిపోయింది. అదే కొవలోకి చెందిన కేసులో సీఐడీ అదికారులు.. తెదేపా గంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19న మంగళగిరిలోని ప్రధాన కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాల్సిందిగా నోటీసులలో పేర్కొన్నారు.

Cases against Telugu yuvatha leader
తెలుగు యువత అధ్యక్షుడికి సీఐడీ నోటీసులు
author img

By

Published : Oct 20, 2022, 2:54 PM IST

CID Notices Telugu yuvatha leader: సామాజిక మాధ్యమాల్లో పోస్టుల వ్యవహారంలో సీఐడీ కేసులు కొనసాగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. భారతి పేరుతో ఉన్న పోస్టుని సామాజిక మాధ్యమాల్లో పెట్టారని సాయికృష్ణపై రెండు వారాల క్రితం కేసు నమోదైంది. దీనిపై సాయికృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ అధికారులు ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే సాయికృష్ణకు 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు సాయికృష్ణకు ఈ నెల 19న నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21వ తేదీన మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్​లోని సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ విచారణకు హాజరు కాని పక్షంలో అరెస్ట్ చేసి 41ఏ (3)&(4) సీఆర్​పీసీ క్రింద అదుపులోకి తీసుకుంటామని నోటీసుల్లో సీఐడీ అధికారులు హెచ్చరించారు. నోటీసుల ప్రకారం రేపు విచారణకు వెళ్తానని సాయికృష్ణ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.