గుంటూరు విద్యానగర్ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని హుండీ పగులగొట్టిన దుండగులు నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయాన్ని తెరచిన అర్చకులు చోరీ విషయం గమనించి ధర్మకర్తలకు సమాచారం ఇచ్చారు. వారు చేసిన ఫిర్యాదుతో పట్టాభిపురం పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు.
అర్థరాత్రి 1 గంట సమయంలో దొంగలు వచ్చినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో నమోదైంది. దొంగలు గోడ దూకి వచ్చినట్లు కనిపించింది. అలాగే ఒక దొంగ సీసీ కెమెరాను గుర్తించి రాడ్డుతో కొట్టగా పగిలిపోయింది. అయితే వేరే ప్రాంతాల్లో ఉన్న కెమెరాల్లో దొంగతనం దృశ్యాలు రికార్డయ్యాయి. మొత్తం మూడు హుండీల్లోని నగదు ఎత్తుకెళ్లినట్లు ఆలయ ట్రస్టీ కొల్లి బాలకృష్ణ తెలిపారు.
మరో ఘటనలో...
ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులోని 4 ఆలయాల్లో ఉన్న హుండీలను దొంగలు పగులగొట్టి నగదు తీసుకెళ్లారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ...గ్రామంలో వీధి దీపాలు వెలగని కారణంగా.. ఉపయోగం లేకుండా పోయింది. ఎస్సై అశోక్.. సిబ్బంతో ఘటనా స్థలాలకు చేరుకుని పరిశీలించారు.
ఇదీ చూడండి: