గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని తహసీల్దార్ కార్యాలయానికి ఒక రైతు పెట్రోల్ సీసాతో రావడం చర్చనీయాంశమైంది. తన పొలానికి సంబంధించి అడంగల్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని శివకోటేశ్వరరావు అనే రైతు పెట్రోల్ సీసాతో ఆందోళనకు దిగాడు. తమ స్థలాన్ని సర్వేయర్ సర్వే చేసి సర్టిఫికెట్ ఇచ్చినా.. అడంగల్‌లో నమోదు చేయడం లేదని వాపోయాడు. ఇప్పటికైనా న్యాయం చేయాలని లేకపోతే పెట్రోల్ పోసుకొని ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అతనితోపాటు గ్రామానికి చెందిన మరికొంతమంది రైతులు నిరసన చేపట్టారు. చినకాకానిలో సమస్యలు ఉన్నాయని... వాటిని ఆర్డీవోకి పంపించామని తహసీల్దారు రాంప్రసాద్ అన్నారు. ఆయన నుంచి అనుమతి రాగానే అడంగల్‌లో నమోదు చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి...'పర్యటన కాదు... ముందు మా సమస్యలు పరిష్కరించండి'