Suspicious death: గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సంకురాత్రి పాడులో దారుణం జరిగింది. నెల రోజుల చిన్నారి నీళ్ల డ్రమ్ములో శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహన్ని పరీక్షల నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ అస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోపికృష్ణ, ఝాన్సీదేవి దంపతులకు నవంబర్ లో మగబిడ్డ జన్మించాడు. పెళ్లైన ఆరు నెలలకే బిడ్డ జన్మించడంతో శిశువుకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. 1.5 లక్షలు అప్పు చేసి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది.
ఈ క్రమంలో ఝాన్సీ దేవి పక్కన పడుకున్న శిశువు డ్రమ్ముల్లో శవంగా తేలాడు. దీంతో.. బాలుడు ఆరోగ్యవంతంగా ఎదలేడనే మానసిక వేదనతో కుటుంబ సభ్యులే నీళ్ల డ్రమ్ములో వేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇదీ చదవండి: