ETV Bharat / state

ఒక్కగానొక్క కుమారుడని ఆస్తి రాసిస్తే వెళ్లగొట్టాడు - రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి షాకిచ్చిన తండ్రి- ట్విస్ట్ అదుర్స్ - FATHER SHOCK TO SON

తండ్రి ఆస్తిని రాయించుకుని సరిగ్గా చూసుకోని కుమారుడు - గిఫ్ట్​ రిజిస్ట్రేషన్​ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న తండ్రి

Father Reclaims Land from Son in Telangana
Father Reclaims Land from Son in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2024, 4:05 PM IST

Father Reclaims Land from Son in Telangana : కుమారుడు బాగానే చూసుకుంటున్నాడు కదా అని ఆ తండ్రి తన పేరు మీద ఉన్న ఆస్తిని కుమారుడికి రాసిచ్చాడు. తీరా రాసిచ్చిన తర్వాత తండ్రితో వాగ్వాదానికి దిగి అతడిని కొట్టాడు. మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కొందరి సలహాతో తన భూమిని తాను తిరిగి పొంది కుమారుడికి దిమ్మతిరిగే షాక్​ ఇచ్చాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్​ గ్రామంలో జరిగింది.

Father Reclaiming Land From His Son : తహసీల్దార్ ప్రవీణ్​ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ముస్తఫాపూర్​ గ్రామానికి చెందిన మద్దెల రాజ కొమురయ్యకు ఐదు ఎకరాల పైచిలుకు భూమి ఉంది. ఆ భూమిలో 4 ఎకరాల 12 గుంటలు భూమి తన ఏకైక కుమారుడు మద్దెల రవికి గతంలో గిఫ్ట్​ డీడ్​ కింద రిజిస్ట్రేషన్​ చేశాడు. కానీ ఈ మధ్యకాలంలో కుమారుడు రవి తండ్రిని కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. దీంతో రాజ కొమురయ్య మనస్తాపానికి గురై సమీపంలోని గుట్టల ప్రాంతంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన అక్కడే ఉన్న గొర్రెల కాపరులు ఆయనను రక్షించి వారితో పాటే తీసుకు వెళ్లి భోజనం పెట్టించారు. ఇలా నెల రోజుల గడిచిన తర్వాత జరిగిన విషయం వారికి చెబితే వారు ధైర్యం చెప్పారు.

కన్న కొడుకు దారుణాలు- ఆస్తి రాయించుకుని తల్లికి చిత్రహింసలు - Son Attacks Mother Over Property

అనంతరం హుజురాబాద్​లోని ఓ రైస్​ మిల్లులో రాజ కొమురయ్య గేట్​ కీపర్​గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాజ కొమురయ్య పరిస్థితి తెలుసుకున్న కొంతమంది, సీనియర్ సిటిజన్​ యాక్ట్​ కింద కుమారుడికి ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని సలహా ఇచ్చారు. వారి సలహా మేరకు రాజ కొమురయ్య తన కుమారుడికి ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీన పరచుకోవడానికి స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కుమారుడు రవి పేరిట ఉన్న 4 ఎకరాల 12 గుంటల భూమిని గిఫ్ట్​ రిజిస్ట్రేషన్​ను క్యాన్సిల్​ చేసి తిరిగి రాజ కొమురయ్య పేరు మీద మార్చారు. పేరు మార్పిడి పట్టా పాస్ పుస్తకాన్ని స్థానిక తహసీల్దార్​ ప్రవీణ్​ కుమార్​ రాజ కొమురయ్యకు ఇచ్చారు. ఉన్న ఆస్తులను తీసుకొని తల్లిదండ్రులను గాలికి వదిలేసే పిల్లలకు ఈ ఘటన ఒక చెంపపెట్టులాంటిదని గ్రామస్థులు అంటున్నారు.

అత్తింటి ఆస్తి కోసం మాస్టర్ ప్లాన్ - ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసేందుకు కుట్ర - Kavali Person Murder in Hyderabad

ఖతర్నాక్ లేడీ! మూడు పెళ్లిళ్లు, ఇద్దరితో ఎఫైర్ - ఆస్తి కోసం భర్తను చంపి కర్ణాటకకు పార్సిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.