ETV Bharat / state

పొరపాట్లను సరిదిద్ధుకోవాల్సిన అవసరం ఉంది - మూడేళ్లే కాదు 30ఏళ్లకయినా శిక్ష తప్పదు : డీజీపీ - DGP COMMENTS ON POLICE SYSTEM

గత ప్రభుత్వంలో ఓ పార్టీ ఆఫీస్‌పై దాడి జరిగినా పోలీసులు బాధ్యతగా వ్యవహరించలేదన్న డీజీపీ - దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని అసహనం

dgp_comments_on_police_system
dgp_comments_on_police_system (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2024, 3:43 PM IST

DGP Dwarakathirumala Rao Comments on Police System: గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కూడా సరిగ్గా విధులు నిర్వహించలేదని డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. గతంలో ఓ పార్టీ ఆఫీస్‌పై దాడి జరిగినా పోలీసులు బాధ్యతగా వ్యవహరించలేదని భావప్రకటనాస్వేచ్ఛ వల్ల దాడి జరిగినట్లు పోలీసులు నమోదు చేసుకున్నారని వెల్లడించారు.

అనంతపురం పోలీస్ శిక్షణ కేంద్రంలో డీఎస్పీల పాసింగ్ ఔట్ పెరేడ్​కు ద్వారకతిరుమల రావు హాజరయ్యారు. పార్టీ ఆఫీసుపై దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని తెలిపారు. మూడేళ్ల తర్వాత చర్యలు ఏంటని ప్రశ్నించడం సరికాదని తప్పు జరిగితే 30 ఏళ్ల తర్వాత అయినా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. కేరళలో తప్పు జరిగిన 20 ఏళ్ల తర్వాత ఓ ఐపీఎస్‌కు శిక్ష విధించారని అన్నారు. న్యాయం చేసేందుకే చట్టాలు, కోర్టులు ఉన్నదని డీజీపీ తెలిపారు.

డీజీపీ ద్వారకతిరుమల రావు (ETV Bharat)

గత ఐదేళ్లలో తప్పులు జరిగిన విషయం వాస్తవం: వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగాయని ప్రస్తుతం వాటిని సరిదిద్దడంపై దృష్టిపెట్టినట్లు డీజీపీ ద్వారక తిరుమలరావు స్పషం చేశారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో తప్పులు జరిగిన విషయం వాస్తవమని ప్రస్తుతం ఆ తప్పులను సరిదిద్దడంపై దృష్టి పెట్టామని వివరించారు. అంతే కాకుండా పోలీసు వ్యవస్థను ప్రజల పట్ల బాధ్యతయుతంగా మార్చడంపైనే దృష్టి సారించినట్లు చెప్పారు. మహిళలు, పిల్లల రక్షణతో పాటు మానవహక్కులకు తొలి ప్రాధాన్యత ఇచ్చేలా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దేపని చేస్తున్నామని స్పష్టం చేశారు. ఐజీ సంజయ్​పై వచ్చిన అవినీతి ఆరోపణలపై మీడియా ప్రతినిధులు అడిగినదానికి సమాధానంగా సంజయ్​పై ప్రభుత్వం విచారణ చేస్తోందని నివేదిక తొలుత జీఏడీకి వెళ్లి ఆ తరువాత తమకు వస్తుందని డీజీపీ వెల్లడించారు.

భూములు లాక్కొని సొంత ఆస్తి మాదిరిగా కొట్టుకుంటున్నారు: పవన్‌ కల్యాణ్​

పోలీసుల సంక్షేమానికి రూ.20 కోట్లు: గత ఐదేళ్లలో పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు చెప్పారు. అనంతపురం పోలీసు శిక్షణ కేంద్రంలో డీఎస్పీల పాసింగ్ ఔట్ పెరేడ్ కు హాజరైన డీజీపీ ద్వారక తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి 20 కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. పోలీసుల సంక్షేమం కోసమని సీఎం చంద్రబాబును 10 కోట్ల రూపాయలు కోరగా, ఆయన 20 కోట్ల రూపాయలు మంజూరు చేశారని డీజీపీ చెప్పారు.

పోలీసుల బయోమెట్రిక్ కోసం గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని, ప్రస్తుత ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ప్రతి జిల్లాలో సైబర్ పోలీసు స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు.

'ప్రేమించిన అమ్మాయికి ఉద్యోగం' - తను కుటుంబానికి ఏమీ చేయలేకపోతున్నానని మనస్థాపం

మంత్రిని చేశాం, అయినా పట్టుదల లేకపోతే ఎలాగయ్యా?: సీఎం చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.