'పరిశ్రమలపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం' - చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వార్తలు
పరిశ్రమలు పోతున్నాయని ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ.. వైకాపా ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహించారు. కియా పరిశ్రమ ఎక్కడికీ పోవడం లేదని చెప్పారు. అలాగే ఏ ప్రాంతంపైనా తమ ప్రభుత్వానికి ద్వేషం లేదని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. సీఎం జగన్కు వస్తోన్న ప్రజాదరణ చూడలేకే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.