గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా చంద్రగిరి ఏసురత్నం మరోసారి బాధ్యతలు చేపట్టారు. పదవీకాలం ముగియడంతో మిర్చియార్డ్ ఛైర్మన్ పదవి ఖాళీ అయింది. పాత పాలక మండలిని మరో సంవత్సరం పొడిగిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేడు మిర్చి మార్కెట్ యార్డు ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ... గత సంవత్సరం మార్కెట్ యార్డు కమిటీ ద్వారా అనేక రకాల సేవలను అందించినట్లు చెప్పారు. ఏడాది కాలంలో మిర్చి రేట్లు తగ్గిన దాఖలాలు లేవన్నారు. మార్కెట్ కమిటీ ఎక్కడా అవినీతికి చోటులేకుండా పని చేసిందని పేర్కొన్నారు. ఈసారీ రైతులకు మెరుగైన సేవలను అందించి.. లాభాలను చేకూర్చే విధంగా పని చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండీ... రాజధాని సంబంధిత వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ