తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేడు నరసరావుపేటకు వస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన ఇక్కడకు చేరుకోనున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రాజధాని రైతులకు మద్దతుగా పట్టణంలో చంద్రబాబు పాదయాత్ర చేపడతారని ఆయన వివరించారు. పట్టణ తెదేపా కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతరం వైకాపా ప్రభుత్వ తీరుపై ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. దిశ చట్టం ఏర్పాటు చేసిన పోలీసులే రాజధాని ఉద్యమ మహిళలపై దాడులు చేస్తున్నారన్నారు. కేసులు పెట్టడం కోసం పోలీసులు చట్టాలు వాడుతున్నారు. అదే చట్టాలు అమలు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మరో బిహార్‌లా మారిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నెలకొందని విమర్శించారు. ఏపీలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందన్నారు. అధికారపార్టీ యాత్రలకు అనుమతులిస్తున్న పోలీసులు రాజధాని రైతులను మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. అనంతరం తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేవరకూ ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వ పాలన అప్పటి తుగ్లక్ పాలనను మించిపోయిందని విమర్శించారు.
నేడు నరసరావుపేటకు చంద్రబాబు - ఏపీలో రాజధానిపై ఆందోళనలు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో నేడు చంద్రబాబు పర్యటించనున్నట్లు జిల్లా తెదేపా నేతలు తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి బస్సు యాత్రలో భాగంగా ఆయన ఇక్కడకు వస్తున్నారని వెల్లడించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేడు నరసరావుపేటకు వస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన ఇక్కడకు చేరుకోనున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రాజధాని రైతులకు మద్దతుగా పట్టణంలో చంద్రబాబు పాదయాత్ర చేపడతారని ఆయన వివరించారు. పట్టణ తెదేపా కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతరం వైకాపా ప్రభుత్వ తీరుపై ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. దిశ చట్టం ఏర్పాటు చేసిన పోలీసులే రాజధాని ఉద్యమ మహిళలపై దాడులు చేస్తున్నారన్నారు. కేసులు పెట్టడం కోసం పోలీసులు చట్టాలు వాడుతున్నారు. అదే చట్టాలు అమలు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మరో బిహార్‌లా మారిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నెలకొందని విమర్శించారు. ఏపీలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందన్నారు. అధికారపార్టీ యాత్రలకు అనుమతులిస్తున్న పోలీసులు రాజధాని రైతులను మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. అనంతరం తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేవరకూ ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వ పాలన అప్పటి తుగ్లక్ పాలనను మించిపోయిందని విమర్శించారు.
నారా చంద్రబాబునాయుడు నరసరావుపేట రాకపై అమరావతి పరిరక్షణ కమిటీ మీడియా సమావేశం.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజధాని రైతుల సహాయార్ధం విరాళాల సేకరణ నేపథ్యంలో ఆదివారం నరసరావుపేటకు రానున్న కార్యక్రమంపై అమరావతి పరిరక్షణ కమిటీ పట్టణ తెదేపా కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించింది. కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు.
Body: మొదటగా ప్రత్తిపాటి మాట్లాడుతూ అమరావతి పరిరక్షణ కోసం రాజధానికి భూములిచ్చిన రైతులు న్యాయంగా ఉద్యమం చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. దిశ చట్టం ఏర్పాటు చేసిన పోలీసులే రాజధాని ఉద్యమ మహిళలపై దాడులు చేస్తున్నారన్నారు. కేసులు పెట్టడం కోసం పోలీసులు చట్టాలు వాడుతున్నారు. అదే చట్టాలు అమలు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారన్నారు. నేడు రణరంగంగా ఆంద్రప్రదేశ్ మారిందని వ్యాఖ్యానించారు. గతంలో బీహార్ గురించి చర్చించుకునే ప్రజలు నేడు ఆంద్రప్రదేశ్ గురించి చర్చించుకుంటున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భయానక వాతావరణంలో ప్రజలు బ్రతుకుతున్నారన్నారు. స్వయంగా కేంద్రమంత్రి చెప్పినా ప్రభుత్వం వినకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాజధానిలో 13 మంది రైతులు సచివాలయానికి కూతవేటు దూరంలో చనిపోతే వారి కుటుంబాలను పరామర్శించేందుకు కూడా ముఖ్యమంత్రి రాకపోవడం విడ్డురమన్నారు. ఏపీ లో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందన్నారు. అధికారపార్టీ యాత్రలకు అనుమతులిస్తున్న పోలీసులు రాజధాని రైతులను మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారన్నారు.
Conclusion:అనంతరం తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేవరకూ ఈ ఉద్యమం ఆగదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగదు చెల్లిస్తామన్నా భూములివ్వని రైతులు రాజధాని కోసం వారి భూములను త్యాగం చేస్తే ప్రభుత్వం వారిపైనే ప్రతాపం చూపడం దారుణమన్నారు. అప్పటి తుగ్లక్ పాలన కంటే మించి వైకాపా ప్రభుత్వం పాలిస్తోందన్నారు.
బైట్ 1: ప్రత్తిపాటి పుల్లారావు, తెదేపా మాజీమంత్రి.
బైట్ 2: జీవీ ఆంజనేయులు, తెదేపా జిల్లా అధ్యక్షులు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.