Chandrababu gets a Grand Welcome at NTR Bhavan: తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాదాపు మూడు నెలల అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు రావటంతో కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు. బెయిల్ పై బయటకు వచ్చాక తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చారు. తమ అధినేతను చూసేందుకు నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. తాజా రాజకీయ పరిణామలపై అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు.
కుప్పంలో లక్ష మెజార్టీ సాధించే దిశగా: ప్రభుత్వ అక్రమ అరెస్టులు వంటి వాటికి తాను భయపడనని, పార్టీ శ్రేణులు కూడా మరింతగా పని చేయాలన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తనను కలిసిన కుప్పం ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. కుప్పంలో నేతల పనితీరు మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే కుప్పం నియోజకవర్గానికి రానున్నట్లు వారికి చెప్పారు. తనను దెబ్బకొట్టేందుకు కుప్పం కార్యకర్తలని ఇబ్బంది పెట్టారన్న చంద్రబాబు టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కుప్పంలో లక్ష మెజార్టీ సాధించే దిశగా పని చేస్తామని నేతలు చంద్రబాబుకు చెప్పారు.
అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు రేవంత్ రెడ్డి! ఇసుకతో బొమ్మలు వేస్తావా ? కళకారుడికి పోలీసుల బెదిరింపులు
కార్యకర్తలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా: కుప్పంలో వైసీపీ ప్రభుత్వం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా అశాంతి, హింస, రాజకీయ వేధింపులు తలెత్తాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా అదరక పార్టీ నేతలు, కార్యకర్తలు నిలబడ్డారని, వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానన్నారు. అధినేత కోసం ఎన్ని కేసులు, ఇబ్బందులు అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని కార్యకర్తలు చంద్రబాబుకు తెలిపారు. నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ, ఓట్ల పరిశీలన వంటి పార్టీ కార్యక్రమాల నిర్వహణ అంశాలను నేతలు చంద్రబాబుకు వివరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పిఎస్ మునిరత్నం, డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు
మారనున్న సమీకరణాలు: బెయిల్ పై విడుదలైన చంద్రబాబు, ఇప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలలో పూర్తి స్థాయిలో పాల్గొనలేదు. తాజాగా ఎన్టీఆర్ భవన్కు రావడంతో, ఇక పూర్తి స్థాయిలో వైసీపీపై పోరాటం కొనసాగిస్తారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే వైసీపీలో లుకలుకలు మెుదలైన నేపథ్యంలో చంద్రబాబు పూర్తి స్థాయిలో వైసీపీ అక్రమాలపై ప్రజల్లోకి వెళ్తే, ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందని అంశంపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఏపీలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, వైసీపీని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండేలా నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేశారు. అధికార వైసీపీ అక్రమాలను ఎండగడుతూ ప్రజల్లో ముందుకు సాగేలా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆయా, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి నేత నుంచి గ్రామస్థాయి నేతల వరకూ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో, చంద్రబాబు పార్టీ కార్యాలయంకు వచ్చి నేతలతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.